Friday, March 29, 2024

పుష్ప టీంకి ర‌ష్యాలో గ్రాండ్ వెల్ క‌మ్.. ట్విట్ట‌ర్ లో ఫొటోలు

ర‌ష్యాలో విడుద‌ల‌కానుంది పుష్ప మూవీ. ఈ చిత్రంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.ర‌ష్మిక మంద‌న న‌టించారు.ఈ మూవీని సుకుమార్ తెర‌కెక్కించారు. డిసెంబర్‌ 8న రష్యాలో పుష్ప విడుదలకాబోతున్న నేపథ్యంలో అక్కడ ప్రమోషన్‌ కార్యక్రమాలు చేయబోతుంది టీమ్‌. అందుకోసం పుష్ప టీమ్‌ రష్యాకి చేరుకుంది. అల్లు అర్జున్‌, హీరోయిన్‌ రష్మిక మందన్నా , దర్శకుడు సుకుమార్‌, సంగీత దర్శకుడు దేవి శ్రీప్రసాద్‌, నిర్మాత రవిశంకర్‌ రష్యాలో అడుగుపెట్టారు. రష్యాలో వీరికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ దక్కింది. అక్కడ పుష్పని విడుదల చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వీరికి స్వాగతం పలికారు. తాజాగా ఆ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. స్టయిలీష్‌లుక్‌లో ఎప్పటిలాగే అదరగొట్టేలా ఉన్నారు బన్నీ. డిసెంబర్‌ 1న మాస్కోలో, డిసెంబర్‌ 3న సెయింట్‌ పీటర్స్ బర్గ్ లో పుష్ప మియర్స్ ప్రదర్శించబోతున్నారు. ఇందులో ఈ టీమ్‌ పాల్గొనబోతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement