Friday, March 15, 2024

Big Breaking | న్యూజిలాండ్​పై టీమిండియా భారీ విజయం​.. సిరీస్​ మనదే, 66 రన్స్​కే కివీస్​ ఆల్​ అవుట్​!

టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్​లో ఇవ్వాల జరుగుతున్న అత్యంత కీలక మ్యాచ్​లో న్యూజిలాండ్​ జట్టు చేతులెత్తేసింది. అత్యంత టఫ్​ ఫైట్​ ఉంటుందని అభిమానులు ఎదురుచూశారు. అయితే.. భారత జట్టు పెట్టిన అత్యంత భారీ టార్గెట్​ (235)కు.. కివీస్​ ఒత్తిడికి గురైనట్టు స్పష్టమవుతోంది.  66 పరుగులకే కివీస్​ ఆల్​ అవుట్​ అయ్యింది. దీంతో భారత్​ 168 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.. టీ20 సిరీస్​ని 2‌‌–1 తేడాతో కైవసం చేసుకుంది.

దీంతో ​ వికెట్లు ఫటా ఫట్ పడేసుకుని ఆటతీరు సరిగా లేక నిరాశ పరుస్తోంది. రెండు ఓవర్లు కూడా పూర్తి కాకుండా 13 పరుగులు చేసి కీలకమైన 4  వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ​ కూరుకుపోయింది. ఫిన్​ అల్లెన్​ (3), కాన్వే (1), మార్క్​ చాప్​మన్​ (0), గ్లెన్​ ఫిలిప్స్​ (2) పరుగులకే పెవిలియన్​ చేరారు. ఆ తర్వాత శాంతనర్​ (13) మిచ్చెల్​ కలిసి ఇన్సింగ్స్​ని గాడిలో పడేసేందుకు ట్రై చేశారు. అయితే.. బ్రేస్​వెల్ (8), సోధి (0), ఫర్గూసన్​ (0), వెంట వెంటనే వికెట్లు కోల్పోయి పెవిలియన్​ చేరారు.  ప్రస్తుతం మిచ్చెల్​ (35), టిక్నర్​ కలిసి పోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది.  

పది ఓవర్లు పూర్తయ్యే సరికి న్యూజిలాండ్​ మొత్తం స్కోరు 66/10 ..

ఇక.. హార్దిక్ పాండ్యా 3, అర్షదీప్ సింగ్ 2, శివం మావి 2, ఉమ్రాన్​ మాలిక్​ 1 వికెట్​ పడగొట్టారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement