Tuesday, March 26, 2024

తొలి వన్డేలో ఆసీస్ పై టీమిండియా ఘన విజయం

ముంబై – భారత్, ఆస్ట్రేలియా మధ్య శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ జట్టుపై 5 వికెట్ల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. కంగారులకు అడ్డుకట్ట వేయడంలో పైచేయి సాధించింది. తొలి ఓవర్ నుంచే ఆసీస్ బ్యాటర్లను కట్టడి చేస్తూ టీమిండియా బౌలర్లు తమదైన శైలిలో బౌలింగ్ ప్రదర్శన చేశారు. ఫలితంగా ఆసీస్ బ్యాటర్లు 188 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ఆసీస్ బ్యాటర్లలో మిషెల్ మార్ష్(81: 65 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లు), స్టీవ్ స్మిత్(22: 30 బంతుల్లో4 ఫోర్లు), జోష్ ఇంగ్లీస్(26: 27 బంతుల్లో1 ఫోర్, 1 సిక్సర్) రాణించారు.. . మరోవైపు భారత్ బౌలర్లలో మొహమ్మద్ షమి, మొహమ్మద్ సిరాజ్ చెరో 3 వికెట్లు తీసుకోగా.. జడేజా 2, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా చెరో వికెట్ తీసుకున్నారు.

అనంతరం 189 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి వచ్చిన టీమిండియా ఓపెనర్లు కూడా జట్టుకు శుభారంభాన్ని ఇవ్వలేకపోయారు. ఇషాన్ కిషన్(3), విరాట్ కోహ్లీ(4) సూర్యకుమార్ యాదవ్(0) విఫలమవడంతో టీమిండియా 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోవలసి వచ్చింది. . అనంతరం క్రీజులోకి వచ్చిన కేెఎల్ రాహుల్ క్రీజులో నిలదొక్కుకున్నాదు . ఒక దశలో నిలకడగా రాణిస్తున్న శుభమాన్ గిల్(20) కూడా 11 ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో అవుట్ కావడంతో.. 39 పరుగులకే నాలుగో వికెట్ కూడా టీమిండియా కోల్పోయింది. దీంతో అనంతరం వచ్చిన హార్దిక్ పాండ్యాతో కలిసి కేఎల్ రాహుల్ ఐదో వికెట్‌కు 44 పరుగులు భాగస్వామ్యం అందించారు. కానీ 83 పరుగుల వద్ద స్టోయినిస్ బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించిన హార్దిక్(25) బౌండరీ వద్ద క్యాచ్ ఇచ్చుకుని పెవిలియన్ చేరాడు. . అనంతరం క్రీజ్ లోకి వచ్చిన రవీంద్ర జడేజా తో కలిసి కేఎల్ రాహుల్ జట్టును విజయ తీరాలకు చేర్చాడు కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లో అజేయంగా 75 పరుగులతో తన సత్తా చాటాడు. అలాగే టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా కూడా 45 పరుగులతో రాణించడంతో తొలి వన్డేలో భారత్ విజయం సాధించింది ఆసీస్ బౌలర్లలో మిచ్చెల్ స్టార్ 3, మార్కస్ స్టోయినీస్ 2 వికెట్లు తీసుకున్నారు రవీంద్ర జడేజా కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది

Advertisement

తాజా వార్తలు

Advertisement