Thursday, April 25, 2024

టీమ్ ఇండియా న‌యా చ‌రిత్ర – మూడు ఫార్మ‌ట్ల‌లోనూ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ వ‌న్..

న్యూఢిల్లీ: ట‌ఈ టీమ్ ఇండియా నయ చ‌రిత్ర‌ను లిఖించింది.. టెస్ట్,వ‌న్డే,టి 20 ఫార్మెట్ క్రికెట్ వ‌ర‌ల్డ్ నెంబ‌ర్ గా నిలిచింది.. ఐసిసి నేడు విడుద‌ల చేసిన జాబితాలో ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో నిలిచింది. ఇటీవ‌ల ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టులో ఇండియా ఇన్నింగ్స్ తేడాతో విక్ట‌రీ సాధించండంతో రోహిత్ సేన‌ 115 పాయింట్ల‌తో అగ్ర‌స్థానంలో నిలిచింది. నాలుగు పాయింట్ల తేడాతో ఆస్ట్రేలియా రెండ‌వ స్థానంలో ఉంది. ఇంగ్లండ్ మూడ‌వ స్థానంలో ఉంది. ఆ జ‌ట్టుకు 106 పాయింట్లు ఉన్నాయి. ఇప్ప‌టికే వ‌న్డే,టి 20 ఫార్మెట్ ల‌లో నెంబ‌ర్ వ‌న్ గా ఉన్న భార‌త్ క్రికెట్ జ‌ట్టు టెస్ట్ ల‌లో కూడా ఫ‌స్ట్ ప్లేస్ కు రావ‌డంతో మొత్తం మూడింటిలోను నెంబ‌ర్ వన్ గా నిలిచింది..

Advertisement

తాజా వార్తలు

Advertisement