Tuesday, March 26, 2024

బ్ర‌హ్మాస్త్ర‌లో భాగ‌మైన మెగాస్టార్-వాయిస్ చెప్పిన చిరంజీవి

భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం బ్ర‌హ్మాస్త్ర. ఈ చిత్రంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కూడా భాగమయ్యారు. ఈ సినిమా కోసం చిరు వాయిస్ ఓవర్ చెప్పారు. ఈ మేరకు ‘బ్రహ్మాస్త్ర’ యూనిట్ ఓ వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోలో చిరంజీవి సరికొత్త హెయిర్ స్టయిల్ తో దర్శనమివ్వడం విశేషం. ఈ సినిమా ట్రైలర్ జూన్ 15న లాంచ్ చేయనున్నారు. బ్ర‌హ్మాస్త్ర చిత్రానికి మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఇవ్వ‌డం విశేం.ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియా భట్, అమితాబ్ బచ్చన్ తదితరులు నటించారు..ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకుడు. ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో టాలీవుడ్ కింగ్ నాగార్జున ఓ కీలక పాత్రలో కనిపించ‌నున్నారు. ‘బ్రహ్మాస్త్ర’ చిత్రం రెండు భాగాలుగా రిలీజ్ కానుంది. తెలుగులో ‘శివ’ పేరుతో ఫస్ట్ పార్ట్ విడుదల చేయనున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement