Thursday, April 18, 2024

Teachers day: తండ్రితో ఉన్న ఫొటో ను షేర్ చేసిన మహేష్ బాబు..

సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో ఓ అరుదైన ఫోటోను షేర్ చేశారు. . తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణతో తాను కలిసున్న ఓ ఆసక్తికరమైన ఫొటోను ట్విట్టర్ లో పంచుకున్నారు. ఈ ఫొటో మహేశ్ బాబు చిన్నప్పటిదని చూడగానే తెలిసిపోతుంది. కళ్లద్దాలు ధరించి ఎంతో క్యూట్ గా ఉన్నాడు. ఇవాళ టీచర్స్ డే సందర్భంగా తండ్రితో ఫొటో పంచుకున్నారు మహేశ్ బాబు. ఇవాళ గురు పూజ్యోత్సవం. దీనిపై మహేశ్ బాబు స్పందిస్తూ… ఇతరుల పట్ల ప్రేమగా ఉండడం, దృఢమైన వ్యక్తిత్వం, క్రమశిక్షణ, కరుణ, వినయం కలిగి ఉండడం వంటి అంశాలను తన తండ్రి ద్వారానే నేర్చుకున్నానని వెల్లడించారు. అందుకు తన తండ్రికి ఎప్పటికీ రుణపడి ఉంటానని పేర్కొన్నారు. అంతేకాకుండా, తన జీవితంలో అనేక అంశాలు నేర్చుకోవడంలోనూ, వ్యక్తిత్వ పరిణామ క్రమంలోనూ తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని మహేశ్ బాబు వివరించారు.

ఇది కూడా చదవండి: మరో వివాదంలో శంకర్… “RC 15” తిప్పలు

Advertisement

తాజా వార్తలు

Advertisement