Friday, March 29, 2024

అంథ‌కారంలో ఏపీ – టిడిపి కార్యాల‌యంలో దేవినేని ఉమా ప్రెస్ మీట్

కృష్ణాజిల్లా , నందిగామ – రాష్ట్రమంతా త్వరలో అంధకారం కాబోతోంద‌ని , విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టిడిపి నేత దేవినేని ఉమా తెలిపారు. విద్యుత్ చార్జీలను వీపరితంగా పెంచడం, రాష్ట్ర సంపద,నిధులను దోచుకోవడం, దాచుకోవడం కమీషన్లకు కక్కుర్తి పడటం ముఖ్యమంత్రి జ‌గ‌న్ నైజమ‌ని దుయ్య‌బ‌ట్టారు. పక్క రాష్ట్రాలకు లేని విద్యుత్తు కోత మన రాష్ట్రంలో ఎందుకు ఏర్పడింది..కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్ బకాయిలు పడటం, బొగ్గును నిల్వ చేయక పోవటంతో ఈలోపం ఏర్ప‌డింద‌న్నారు.ఇతర ప్రాంతాల నుండి కమీషన్లకు కక్కుర్తిపడి.. ఎంత విద్యుత్ కొనుగోలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయలేదన్నారు. మా నాయకుడు చంద్ర‌బాబునాయుడు అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు విద్యుత్ కోత అంటే ఏమిటో రాష్ట్ర ప్రజలకు తెలియదని చెప్పారు.

గ్రామాల్లో ఆరు గంటలు , పట్టణాల్లో మూడు గంటలు.. విద్యుత్ కోతల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మళ్ళీ కిరోసిన్ బుడ్డీలు, లాంతర్ల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు.
ఎందుకు ఓటేశామా అని బాధపడుతున్నారన్నారు. పిఆర్సి పై ఉద్యోగులు తీవ్ర ఆందోళన చేస్తుంటే.. పోలీస్ శాఖలకు హెచ్చరిక జారీ చేస్తున్న ముఖ్యమంత్రిని ఏమనాలని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో మా నాయకుడు దండం పెట్టి మరి ప్రాధేయపడ్డారు.. త్వరలో విద్యుత్ కోతలతో అంధకారంలో మిగులుతుంది.. విద్యుత్ కొనుగోలు చేయండి బోగ్గునిల్వలు పెంచండి అని చెప్పిన పెడచెవిన పెట్టారన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement