Tuesday, May 18, 2021

చంద్రబాబు ఓ EXPIRE అయిపోయిన టాబ్లెట్

టీడీపీ అధినేత చంద్రబాబు గడువు ముగిసిన టాబ్లెట్ లాంటివాడని గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. గన్నవరం బాలుర హైస్కూల్‌లో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీలో లోకేష్ గుది బండలాంటి వాడని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఓటుకు నోటు కేసు నడుస్తోంది కాబట్టి టీడీఎల్పీని టీఆర్ఎస్‌ఎల్సీలో విలీనం చేశాడన్నారు. ఏపీలో కూడా టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమని వల్లభనేని వంశీ ఆరోపించారు. ఓటుకు నోటు కేసు ఉంది కాబట్టే ఈ కేసుకు భయపడి 2024 వరకు హైదరాబాద్‌లో రాజధాని హక్కులున్నా ఏపీకి బాబు పారిపోయి వచ్చాడన్నారు.

పంచాయతీల్లో 40 శాతం ఓట్లు వచ్చాయని టపాసులు కాల్చిన తండ్రి, కొడుకులు పరిషత్ ఎన్నికల్లో పాల్గొనకుండా ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు. పరిషత్ ఎన్నికల నుంచి బాబు తప్పుకోవడం ఆడలేక మద్దెల ఓడు అన్నట్లుందని విమర్శించారు. 2019 ఎన్నికల సమయంలో రూ.10వేల కోట్లను ఆడపడుచులకు ఇచ్చి మోసం చేయాలని చంద్రబాబు చూశాడని, అదే రూ.10 వేల కోట్లతో సీఎం జగన్ ఆడపడుచులకు సొంతింటి కల నెరవేర్చాని వల్లభనేని వంశీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Prabha News