Wednesday, March 27, 2024

మాజీ మంత్రి దేవినేని ఉమ కాన్వాయ్ నిలిపివేత.. నిప్పులు చెరిగిన చంద్రబాబు

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో మాజీ మంత్రి దేవినేని ఉమాకు బెయిల్ మంజూరు కావడంతో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. దీంతో భారీ కాన్వాయ్‌తో విజయవాడ వెళ్తుండగా భీమడోలు వద్ద మాజీ మంత్రి దేవినేని ఉమా కాన్వాయ్‌ను పోలీసులు నిలిపివేశారు. రోడ్డుకు అడ్డంగా లారీలు, జీపులు పెట్టి రోడ్డుపై నిలిపివేశారు. దేవినేని ఉమ కారును పంపి మిగిలిన కాన్వాయ్‌కు అనుమతి నిరాకరించారు. దీంతో టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి, ఇతర నేతలు అక్కడే నిరసనకు దిగారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

అయితే దేవినేని ఉమా కాన్వాయ్‌ను పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దేవినేని ఉమ కాన్వాయ్‌ను జాతీయ రహదారిపై పొలీసులు అడ్డుకోవడం హేయమని మండిపడ్డారు. హింసించి ఆనందించడం జగన్‌కు పరిపాటిగా మారిందన్నారు. జనం నీరాజనాలు పలుకుతుంటే తట్టుకోలేక కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. అసలు జాతీయ రహదారిపై పోలీసులు ఏ విధంగా వాహనాలు ఆపుతారని చంద్రబాబు ప్రశ్నించారు. చట్టాన్ని జగన్ తన చుట్టంలా మార్చుకుంటున్నాడని విమర్శించారు.

ఈ వార్త కూడా చదవండి: తీన్మార్ మల్లన్న అరెస్టుకు రంగం సిద్ధం

Advertisement

తాజా వార్తలు

Advertisement