Friday, April 26, 2024

స్కిప్ట్ ప్ర‌కార‌మే చేశా.. న‌న్ను క్ష‌మించండి చంద్ర‌బాబు.. గంగ‌వ్వ‌

టిడిపి అధినేత చంద్ర‌బాబు నాయుడుకి యూట్యూబ్ స్టార్ గంగ‌వ్వ క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌డం ఇప్పుడు వైర‌ల్ అవుతోంది.చంద్ర‌బాబు క్షమించండి అంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది. ఈ వీడియో వైరల్ గా మారడంతో గంగవ్వ క్షమాపణలు ఎందుకు చెప్పింది.. ఏం జరిగింది అంటూ నెటిజన్లు ఆరా తీస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఉగాది పండుగ సందర్భంగా ఓ ప్రైవేట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో ఒక కార్యక్రమం ప్రసారమైంది. ఈ నేపథ్యంలో ఈ షోలో పాల్గొన్న అతిధులకు ఆటపాట నిర్వహించారు. ఇందులో గంగవ్వ కూడా పాలుపంచుకుంది. గంగవ్వ వంతు రాగానే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆయన తనయుడు నారా లోకేశ్ ల చిత్రాలను చూపిస్తూ వీరి గురించి ఏదో ఒకటి చెప్పాలని యాంకర్ కోరారు. దీంతో గంగవ్వ చంద్రబాబు కు గ్రహణం పట్టుకుంది అని చెప్పింది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో టిడిపి సానుభూతిపరులు గంగవ్వపై విమర్శలు చేశారు. కొంచెం పేరు ప్రతిష్టలు వచ్చేటప్పటికి గంగవ్వకు తల పొగరు ఎక్కిందని విమర్శించారు. తాను చంద్రబాబు గురించి మాట్లాడిన వీడియో వైరల్ కావడం.. తనపై విమర్శలు ఎక్కువ కావడంతో గంగవ్వ స్పందించింది. ఈ మేరకు గంగవ్వ ఒక వీడియో విడుదల చేసింది. చంద్రబాబుకు క్షమాపణలు చెప్పింది. నేను షోలో ఏది మాట్లాడినా అది స్క్రిప్ట్ ప్రకారం రూపొందింది. నేను దానిని చెప్పడానికి ఆ సమయంలో కట్టుబడి ఉన్నాను. నా వ్యాఖ్యలకు నేను చింతిస్తున్నాను. టీడీపీ అధినేత చంద్రబాబుకు నేను బేషరతుగా క్షమాపణలు చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన వ్యక్తులకు నేను ఎప్పుడూ అలాంటి దాన్ని కాదని తెలుసు. నా చర్యలను వ్యాఖ్యలను క్షమించమని మీ అందరినీ కోరుతున్నాను అని గంగవ్వ విడుదల చేసిన వీడియోలో పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement