Wednesday, April 24, 2024

తెలంగాణ కేబినెట్‌లో సగం మంది టీడీపీ వారే

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన నాటి నుంచి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేశారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలో టీఆర్ఎస్ ధీటుకు టీడీపీ ఉండేది. కానీ ఓటుకు నోటు ఉదంతంతో టీడీపీ నేతలందరూ పార్టీ ఫిరాయించారు. అధికార టీఆర్ఎస్‌లోకి వలసలు వెళ్లిపోయారు. దీంతో తెలంగాణలో టీడీపీ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి టీడీపీ పోటీ చేసినా సింగిల్ డిజిట్‌లోనే సీట్లు వచ్చాయి. దీంతో ఆ పార్టీ పని దాదాపుగా అయిపోయిందని అప్పుడే ఖరారైపోయింది.

అయితే టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లోకి వలస వచ్చినవారికే కేసీఆర్ మంత్రి పదవులు కట్టబెట్టడం విశేషం. ఈ జాబితాలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్ తదితర నేతలు ఉన్నారు. వీరంతా టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చినవారే. ఇప్పుడు ఏకంగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు రమణనే తమ పార్టీలో కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. దీంతో టార్గెట్ టీడీపీని టీఆర్ఎస్ విజయవంతంగా పూర్తి చేసిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అటు ఎల్.రమణకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఎల్.రమణకు ఎలాంటి పదవి కట్టబెడతారో వేచి చూడాలి.

ఈ వార్త కూడా చదవండి: కారెక్కిన రమణకు కీలక పదవి

Advertisement

తాజా వార్తలు

Advertisement