Wednesday, October 4, 2023

తార‌క‌ర‌త్నకి అరుదైన వ్యాధి.. బెంగళూరు వెళ్లనున్న ఎన్టీఆర్.. కల్యాణ్ రామ్

న‌టుడు తార‌క‌ర‌త్న‌కి బెంగుళూరులోని నారాయ‌ణ హృద‌యాల‌య ఆసుప‌త్రిలో చికిత్స జ‌రుగుతోంది. కాగా తారకతర్న అరుదైన ‘మెలెనా’ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు. ఈ వ్యాధి కారణంగా చిన్న ప్రేగు వద్ద అధికంగా బ్లీడింగ్ అవుతుందని అన్నారు. బ్లీడింగ్ కారణంగా పలు శరీర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినట్లు చెప్పారు. మెలైనా వ్యాధి కారణంగా తారకరత్న అధిక ఆయాసంతో బాధపడుతున్నట్లు చెప్పారు. ఆయనకు గుండెలో బ్లాక్స్ ఎక్కువగా ఉండటం ద్వారా ఎక్మో (ECMO) ద్వారా చికిత్స అందిస్తున్నామని..

- Advertisement -
   

బెలూన్ యాంజియో ప్లాస్టీ ద్వారా బ్లడ్ పంపింగ్ చేస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలోనే చికిత్స అందిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. కాగా.. తారకతర్న ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో ఆయన సోదరులు టాలీవుడ్ స్టార్ హీరో జూ. ఎన్టీఆర్‌తో పాటు కల్యాణ్ రామ్ కాసేపట్లో బెంగళూరు బయల్దేరి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో వారు బెంగళూరు చేరుకోనున్నారు. తారకతర్న ఆరోగ్య పరిస్థితిపై దగ్గుబాటి పురందేశ్వరి ఆరా తీశారు. ఆసుపత్రికి వెళ్లిన ఆమె.. డాక్టర్లతో మాట్లాడారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి, పరిస్థితి అంచనా వేస్తామని డాక్టర్లు చెప్పారన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో బాలకృష్ణ, చంద్రబాబు, తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, ఆయన తండ్రి ఉన్నారు. కాగా.. తారకతర్న త్వరగా కోలుకోవాలని నందమూరి అభిమానులు కోరుకుంటున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement