Saturday, March 23, 2024

ఎక్కువ ప్ర‌యోగాలు చేసింది క‌ల్యాణ్ రామ్ అన్న‌య్యే – ఎన్టీఆర్

నందమూరి కల్యాణ్‌రామ్‌ కథానాయకుడిగా రూపొం దుతున్న చిత్రం ‘అమిగోస్‌’. ఇందులో కల్యాణ్‌రామ్‌ మూడు పాత్రలు చేస్తున్నారు. అషికా రంగనాథన్‌ నాయిక. రాజేంద్ర రెడ్డి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మిస్తున్నారు. ఫిబ్రవరి 10న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. జూ.ఎన్టీఆర్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ మాట్లాడుతూ ”మా నందమూరి కుటుంబంలో హీరోలు ఎంతమంది ఉన్నప్పటికీ ఎక్కవగా ప్రయోగాత్మక చిత్రాలు తీసింది, చేసింది మాత్రం అన్నయ్య కల్యాణ్‌రామ్‌. నేను జైలవకుశలో త్రిపాత్రాభినయం చేశాను. అలా నటించడం ఎంతకష్టమో నాకు తెలుసు. అన్న య్య ఈ చిత్రంలో మూడు పాత్రలు చేశారు. ఆయన కెరీర్‌లో అమిగోస్‌ మైలురాయిలా నిలుస్తుంది. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందాని దర్శకుడు రాజేంద్రను చూశాకే తెలిసింది. ఇంజనీరింగ్‌ చదివాక ఉద్యోగం చేసుకో అని తల్లితండ్రులు సూచిస్తే ఓ సినిమాకు దర్శకత్వం వహించా కే తిరిగి వస్తాను అని చెప్పాడట. సినిమా అప్‌డేట్‌లుకావాలని అభిమానులు ఒత్తిడి చేయవద్దని, ఇది విన్నపం మాత్రమే. నా తదుపరి చిత్రం ఇదే నెలలో ప్రారంభిస్తా అని అన్నారు.


కల్యాణ్‌రామ్‌ మాట్లాడుతూ ”ఇది వినూత్నమైన థ్రిల్లర్‌ చిత్రం. మనుషులను పోలిన మనుషుల కథా చిత్రమిది. బింబిసార తర్వాత ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటు న్న సమయంలో దర్శకుడు రాజేంద్ర ఈ కథని ఇచ్చారు. ఈ సినిమా ఎవరికీ నిరుత్సాహపరచదు” అన్నారు.
”మైత్రి మూవీస్‌ వంటి పెద్ద సంస్థ, కల్యాణ్‌ రామ్‌ నా కథను నమ్మి ఈ అవకాశం కల్పించినందుకు థాంక్స్‌” అని దర్శకుడు రాజేంద్ర చెప్పారు. నిర్మాతలు నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ మాట్లాడుతూ ”కల్యామ్‌రామ్‌తో ఎప్పటి నుండో సినిమా చేయాలని అనుకున్నాం. ఇది ఇప్పటికి నెరవేరింది. బింబిసార తర్వాత ఆ స్థాయిలో ఉంటుంది. ది మాకు హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుంది” అన్నారు. ఈ కార్యక్రమంలో అషికా రంగనాథన్‌, వశిష్ట, రామజోగయ్య శాస్త్రి, బుచ్చిబాబు, బ్రహ్మాజీ, ప్రణవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement