Thursday, April 25, 2024

తాండూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి బాటలు..

తాండూరు నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి బాటలు వేస్తూ 26కోట్ల, 50 లక్షల రూపాయల నిధులతో ప‌లు సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి , స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి , చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య , కలెక్టర్ నిఖిల చేప‌ట్టారు. పెద్దేముల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల లో 50 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న ఐదు అదనపు తరగతి గదుల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. తాండూరు నియోజకవర్గం యాలాల్ మండలం కొకట్ గ్రామ పరిధిలో రెండు కోట్ల, 25 లక్షల రూపాయల నిధులతో నిర్మించిన డిగ్రీ కళాశాల నూతన భవనాన్ని,20 కోట్ల రూపాయల నిధుల తో నిర్మించిన మాత శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. సాయిపూర్ లో 20 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన అంగన్ వాడి భవన నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేసారు. పట్టణంలో 3 కోట్ల, 47 లక్షలతో నిర్మించిన నూతన మున్సిపల్ భవనాన్ని ప్రారంభించారు. చెత్త ఆటోలను ప్రారంభించారు.అంతకుముందు హనుమాన్ ఫంక్షన్ హాల్ లో 165 మంది లబ్ధిదారులకు,1 కోటి 65 లక్షల 19 వేల రూపాయల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేసారు.

ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నాయకత్వంలో తాండూరు అభివృద్ధికి నిరంతర కృషి చేస్తున్నార‌న్నారు. 100 పడకల ఆస్పత్రి ని చూస్తే స్వర్గీయ ఇంద్రారెడ్డి గుర్తుకు వచ్చారని తెలిపారు. నాడు మహేందర్ రెడ్డిని ఎమ్మెల్యే గా గెలిపిస్తే తాండూరుకు 100 పడకల ఆస్పత్రి తెస్తా అని చేసిన వాగ్దానం సాకారం కావటం ఆనందంగా ఉందన్నారు. రెండవ దశలో వికారాబాద్ జిల్లాలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేస్తామ‌న్నారు. కేసీఆర్ ఆదేశం తో ఆస్పత్రికి రోగుల వెంట వచ్చే వారి కోసం వెయిటింగ్ హల్ లు నిర్మిస్తామ‌ని చెప్పారు.100 పడకల ఆస్పత్రితో పాటు,మాత శిశు సంరక్షణ కేంద్రాల్లో త్వరలో ఏర్పాటు చేస్తామ‌న్నారు. నాడు రంగారెడ్డి జిల్లాలో ఒక కళాశాల కూడా లేనప్పుడు చొరవ తీసుకొని,చేవెళ్ల తో పాటు 5 కళాశాలలు మంజూరు కావ‌డం విశేష‌మ‌ని చెప్పారు.నేడు అవి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి విద్యార్థులతో కళకళ లాడటం హర్షదాయకమ‌న్నారు. ప్రజలకు ఉపయోగ పడే కార్యక్రమాలు చేపడుతూ తెలంగాణా ప్రభుత్వం ముందుకి వెళ్తుంద‌న్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తెలంగాణలో అమలు అవుతున్నాయి. ఆడ పిల్ల పుడితే గతంలో బాధ పడే వారు…నేడు కేసీఆర్ మేనమామలాగా కళ్యాణలక్ష్మి,షాది ముబారక్ లతో పేదింటి ఆడ పిల్లల పెళ్ళిళ్ళ కు అండగా ఉన్నారు.నేడు లక్ద్మీ పుట్టిందని ఆనందపడుతున్నారు. రైతు బంధు,రైతు భీమాతో రైతన్నకు అండగా ప్రభుత్వం నిలుస్తుంద‌న్నారు. ఒంటరి మహిళలకు పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ ఎస్ అని చెప్పారు.

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ..ఎన్నికల్లప్పుడే రాజకీయాలు.. తర్వాత అందరూ అభివృద్ధిలో కలిసి రావాలన్నారు. తెలంగాణలో ప్రజలకు ఉపయోగపడేలా,అన్ని కార్యాలయాలు ఒకే దగ్గర ఉండేలా సమీకృత కలెక్టర్ భవనాలు…నియోజకవర్గ కేంద్రాల్లో ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయాల నిర్మాణాలు చేప‌ట్టామన్నారు.. కాలుష్యం తగ్గించటానికి అందరూ తమ బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మొక్కలు నాటి తాండూరులో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించాలన్నారు. గ్రీన్ బడ్జెట్ వినియోగించి,ప్రభుత్వ లక్ష్యం మేరకు కౌన్సిలర్లు,వైస్ ఛైర్మన్, చైర్మన్ ,కమిషనర్ లు చొరవ చూపాలని తెలిపారు. నిధుల కోసం కృషి చేద్దామ‌ని చెప్పారు. వర్షాలు పడినప్పుడు పాడైన రోడ్ల బాగు కోసం కృషి చేస్తాం. మంత్రి కే టి ఆర్ చొరవతో అనేక పనులు మంజూరు చేయించాను.. కౌన్సిలర్లు అందరూ ఏకతాటిగా ఉండి,అభివృద్ధి కి పాటుపడాలన్నారు .

పైలట్ రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పథం లో నడుపుతోన్న కేసీఆర్ .. తాండూరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నారు. తాండూరు అభివృద్ధిలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారి పాత్ర ఎంతో గొప్పదన్నారు.తాండూరు నియోజకవర్గ రూపురేఖలు మార్చుతాం.రానున్న కాలంలో సమస్యలు లేని ప్రాంతంగా నిలుపుతాం.రోడ్ల పనులు పూర్తి చేస్తాం,మౌలిక సదుపాయాల కల్పన కు కృషి చేస్తాం. కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ లతో పెందింటి ఆడపిల్లల పెళ్ళిళ్ళకు అండగా ప్రభుత్వం నిలుస్తుంద‌న్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement