Thursday, April 18, 2024

Followup: అమిత్‌ షా తో తమిళిసై భేటీ.. రాష్ట్ర రాజకీయాలపై చర్చ?

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: విశ్వవిద్యాలయాల్లో ఖాళీల భర్తీ, మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు, ఎమ్మెల్యేల కొనుగోళ్ల వివాదం నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది. సోమవారం ఢిల్లీ చేరుకున్న ఆమె మధ్యాహ్నం కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. అయితే ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు భేటీ గురించి ఆమెను ప్రశ్నించగా.. తాను గవర్నర్‌గా పదవీబాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిశానని తెలిపారు.

అలాగే గవర్నర్‌గా తన పదవీకాలంపై రాసిన పుస్తకాన్ని ఆయనకు బహుకరించినట్టు తెలిపారు. అంతకు మించి ఈ పర్యటనలో ఎలాంటి రాజకీయాంశాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా యూనివర్సిటీల్లో ఖాళీల అంశంపై ప్రస్తావించగా, ఆమె సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావుతో విబేధాలు, గవర్నర్‌ను అవమానిస్తున్నారంటూ ఆమె గతంలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమె పుస్తకంలో ఏయే అంశాలు ప్రస్తావించారన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement