Friday, March 29, 2024

అజిత్ ఇంటికి వెళ్లిన.. విజ‌య్

త‌మిళ స్టార్ హీరో అజిత్ ఇంటికి మ‌రో స్టార్ హీరో విజ‌య్ వెళ్లారు. రీసెంట్ గా అజిత్ తండ్రి సుబ్రహ్మణ్యం మరణించిన సంగతి తెలిసిందే. దీనితో తమిళ సినీ ప్రముఖులు, సెలెబ్రిటీలు అజిత్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. సుబ్రహ్మణ్యం మృతికి నివాళులు అర్పించారు. ఆ సమయంలో విజయ్ కశ్మీర్ లో తన తదుపరి చిత్రం ‘లియో’ షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల రాలేకపోయారు. రీసెంట్ గా చెన్నై చేరుకున్న విజ‌య్ నగరానికి రాగానే అజిత్ ఇంటికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన వాహనాలకు సంబంధించిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. సందర్భం ఏదైనా అజిత్, విజయ్ చాలా కాలం తర్వాత కలవడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. 1995లో అజిత్, విజయ్ కలసి రాజావిన్ పార్వైలే చిత్రంలో నటించారు. ఆ తర్వాత వీరిద్దరూ తమిళనాట స్టార్ హీరోలుగా ఎదిగారు. వీరిద్దరి సినిమాలు రిలీజ్ అవుతుంటే తమిళనాట పండగ వాతావరణం ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement