Thursday, April 25, 2024

రేపే ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబన్‌ల ప్రభుత్వం ఏర్పాటు

అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమయ్యారు. ముస్లింలకు పవిత్రదినమైన శుక్రవారం రోజు(రేపు) ప్రార్థనల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అఫ్గాన్ నుంచి అమెరికా తన సైన్యాలను వెనక్కి తీసుకెళ్లిన తర్వాత అఫ్గాన్‌ పూర్తిగా తాలిబన్ల ఆధీనంలోకి వెళ్లిపోయింది. తమ దేశం నుంచి సురక్షిత రాకపోకలకు హామీ ఇచ్చిన తాలిబన్లు కాబూల్ విమానాశ్రయాన్ని మాత్రం మూసే ఉంచారు.

ఏడాది ఆగస్టు 14న ఆఫ్గనిస్తాన్‌ను తాలిబన్లు పూర్తిగా ఆక్రమించారు. స్వల్ప వ్యవధిలోనే దేశం మొత్తాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోగలిగారు. తాలిబన్లతో పోరాడలేక సైన్యం చేతులెత్తేయడంతో వారి పని మరింత సులువైంది. ప్రస్తుతం ప్రభుత్వ ఏర్పాటుపై ఫోకస్ చేసిన తాలిబన్లు… పాలనకు సంబంధించి ఎటువంటి పాలసీలు రూపొందించబోతున్నారనే చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మహిళల హక్కులపై మొదటి నుంచి ఆందోళన వ్యక్తమవుతూనే ఉంది. స్త్రీలకు విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెబుతూనే… వారిని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల నుంచి ఇంటికి పంపించిన ఘటనలు చోటు చేసుకున్నాయి.

ఈ వార్త కూడా చదవండి: సోషల్ మీడియా వార్తలకు మతం రంగు పులుముతున్నారు: సీజేఐ ఎన్వీ రమణ

Advertisement

తాజా వార్తలు

Advertisement