Saturday, October 12, 2024

ఐపీఎస్‌ ఆఫీసర్‌గా ట‌బు.. ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ రిలీజ్

ఐపీఎస్ ఆఫీస‌ర్ గా క‌నిపించ‌నుంది న‌టి ట‌బు.. బాలీవుడ్ హీరో అజయ్‌ దేవ్‌గన్ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్‌లో నటిస్తున్న చిత్రం భోళా .అజయ్‌ దేవ్‌గన్‌ ఫిలిమ్స్‌, టీ-సిరీస్‌ ఫిలిమ్స్‌, రిలయన్స్ ఎంటర్‌టైన్‌ మెంట్‌, డ్రీమ్ వారియర్‌ పిక్చర్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. భోళా అజయ్‌దేవ్‌గన్‌ దర్శకత్వం వహిస్తున్న నాలుగో సినిమా కావడం విశేషం.యాక్షన్‌ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తున్న ఈ చిత్రాన్ని2023 మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. భోళా 3డీలో కూడా విడుదల కానుంది. స్టార్ హీరో కార్తీ నటించిన బ్లాక్ బస్టర్‌ ఖైదీ చిత్రానికి హిందీ రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. టబు కీలక పాత్రలో నటిస్తోంది. టబు పోస్ట‌ర్ ని రిలీజ్ చేశారు మేక‌ర్స్. ఐపీఎస్‌ ఆఫీసర్‌గా చేతిలో గన్‌తో స్టైలిష్‌ అవతార్‌లో కనిపిస్తున్న ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement