Thursday, November 7, 2024

T20 WC | డాని, స్కివర్ విజృంభ‌న‌.. సఫారీలపై ఇంగ్లండ్ ఘ‌న విజ‌యం !

మ‌హిళ‌ల టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ భాగంగా నేడు జ‌రిగిన మ్యాచ్ లో ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు అద్బుత విజ‌యం సాధించింది. గ్రూప్-బిలో ఉన్న సౌతాఫ్రికాతో త‌ల‌ప‌డిన ఇంగ్లండ్… 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీల‌ను ఇంగ్లండ్ త‌క్కువ స్కోర్‌కే క‌ట్ట‌డి చేసింది.

దీంతో ద‌క్షిణాఫ్రికా 6 వికెట్ల న‌ష్టానికి 124 ప‌రుగులకే పరిమితమైంది. ఇక స్వ‌ల్ప టార్గెట్ తో చేజింగ్ కు ప్రారంభించిన ఇంగ్లండ్ బ్యాట్ తో చెల‌రేగింది. ఓపెన‌ర్ డానియ‌ల్ వ్యాట్ (43), ఆల్‌రౌండ‌ర్ నాట్ సీవ‌ర్ బ్రంట్ (48 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్ ఆడి విజ‌యాన్ని లాగేసుకున్నారు.

ఈ విజయం తో గ్రూప్ బిలో ఉన్న ఇంగ్లండ్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రెండేసి పాయింట్లతో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్లు రెండు, మూడు స్థానాల్లో ఉన్నాయి. స్కాట్‌లాండ్ జట్టు ఇంకా ఖాతా తెరవలేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement