Monday, November 11, 2024

T20 WC | దంచికొట్టిన డివైన్… భార‌త్ టార్గెట్ ఎంతంటే !

దుబాయ్ వేదికగా జరుగుతున్న మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నేడు గ్రూప్-ఎలో ఉన్న భారత్ – న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్… భార‌త్ ముందు పోరాడే టార్గెట్ సెట్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 160 ప‌రుగులు బాదింది

న్యూజిలాండ్ బ్యాట‌ర్ల‌లో కెప్టెన్ సోఫీ డివైన్ (57 నాటౌట్) తో అద‌ర‌గొట్టింది. జార్జియా ప్లిమ్మర్ (34), సుజీ బేట్స్ (27) ఆక‌ట్టుకున్నారు. ఇక భార‌త బౌల‌ర్ల‌లో రేణుకా సింగ్ రెండు వికెట్లు తీయ‌గా.. అరుంధతి రెడ్డి, ఆశా శోభన త‌లో వికెట్ ద‌క్కించుకున్నారు. కాగా, భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు 161 ప‌రుగుల టార్గెట్ తో చేజింగ్ ప్రారంభించ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement