Friday, April 26, 2024

జీ న్యూస్‌కు టీ20 లీగ్ ప్ర‌సార హ‌క్కులు.. ఓటీటీలోనూ ప్ర‌సారానికి స‌న్నాహాలు

ప్ర‌ముఖ టీవీ చానెల్ జీ న్యూస్ మ‌రోసారి దీర్ఘ‌కాలిక మీడియా ప్ర‌సార హ‌క్కుల కాంట్రాక్ట్ ద‌క్కించుకుంది. యూఏఈ టీ-20 లీగ్ ప్ర‌సార హ‌క్కుల కాంట్రాక్ట్‌పై రెండు సంస్థ‌లు ఒప్పందం కుదుర్చుకున్నాయి. మీడియా ప‌రిశ్ర‌మ వ‌ర్గాల క‌థ‌నం ప్ర‌కారం ప‌దేండ్ల పాటు రూ.800-900 కోట్ల‌కు కాంట్రాక్ట్ కుదిరింద‌ని తెలుస్తుంది. దీంతో క్రీడ‌ల ప్రసార హ‌క్కుల విభాగంలోకి జీ న్యూస్ మ‌ళ్లీ ఎంట‌రైన‌ట్ల‌యింది. 2016లో జీ న్యూస్ త‌న టెన్ స్పోర్ట్స్ టెలివిజ‌న్ నెట్‌వ‌ర్క్‌ను సోనీకి రూ.2,600 కోట్ల‌కు విక్ర‌యించింది. అయితే తాజా నిర్ణ‌యంతో మ‌ళ్లీ క్రీడ‌ల ప్రసార వ్యాపారంలోకి అడుగు పెట్టిన‌ట్ల‌యింది జీ న్యూస్.

యూఏఈ టీ-20 లీగ్ టోర్నీ పూర్తిగా జీ టెలివిజ‌న్ చానెల్స్‌లోనే ప్ర‌సారం కానుంది. భార‌త్‌తోపాటు ప్ర‌పంచ‌వ్యాప్తంగా కూడా జీ న్యూస్ ఓవ‌ర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లోనే ప్రసారం అవుతుంది. వ‌చ్చేనెల‌లో యూఏఈ-టీ 20 లీగ్ ప్రారంభం కానున్న‌ద‌ని స‌మాచారం. ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆధ్వ‌ర్యంలో జ‌రిగే యూఏఈ టీ-20 లీగ్‌లో ఆరు జ‌ట్లు పాల్గొంటారు. 34 మ్యాచ్‌ల టోర్న‌మెంట్ ఇది. రిల‌య‌న్స్ ఇండస్ట్రీస్‌, అదానీ స్పోర్ట్స్‌లైన్‌, కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌, లాన్స‌ర్ క్యాపిట‌ల్‌, జీఎంఆర్ గ్రూప్‌, కాప్రి గ్లోబ‌ల్ ఫ్రాంచైసీలు ఆ జ‌ట్ల‌కు సార‌ధ్యం వ‌హిస్తున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement