Saturday, January 4, 2025

TG | టి ఫైబర్ ట్రెండ్‌ సెట్టర్‌..

  • లెన్స్‌కార్ట్ భారీ పెట్టుబ‌డులు

ఇంట్లోనే మొబైల్‌, కంప్యూటర్‌, టీవీ వినియోగించడానికి అవకాశం కల్పించే టీ ఫైబర్‌ సేవలను ఆదివారం ఐటీశాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు ప్రారంభించారు. దీనికోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మొబైల్‌ యాప్‌ సిద్ధం చేయడంతో పాటు రద్దీ ప్రాంతాల్లో కియోస్క్‌లు ఏర్పాటు చేస్తుంది. ఈ యాప్‌ ఆవిష్కరణతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ ఇంటర్నెట్‌ అందించేందుకు ఉద్దేశించిన టీఫైబర్‌ ప్రాజెక్టును ప్రజా పాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రారంభించింది. దీని ద్వారా ప్రభుత్వ విద్యాలయాలతో పాటు తొలి ఏడాది 30 వేల ప్రభుత్వ కార్యాలయాలకు బ్రాడ్‌బ్యాండ్‌ అందించనుంది.

లెన్స్‌కార్ట్ పెట్టుబ‌డులు

రాష్ట్రంలోకి మరో భారీ పెట్టుబడి వచ్చింది. మల్టీ నేషనల్ ఐవేర్ కంపెనీ ‘లెన్స్‌కార్ట్’ హైదరాబాద్‌లో రూ.1500 కోట్లతో మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలోనే అతిపెద్ద ఐవేర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను స్థాపించేందుకు ముందుకొచ్చింది. ఈ యూనిట్ ద్వారా మొత్తం 1600 మందికి ఉపాధి దక్కునుంది. వచ్చే నెల నుంచి పనులను ప్రారంభించనున్నట్టు లెన్స్ కార్ట్ కంపెనీ తెలిపింది.

https://twitter.com/OffDSB/status/1865806530391732474
Advertisement

తాజా వార్తలు

Advertisement