Saturday, April 20, 2024

డాగ్ నుంచి త‌ప్పించుకున్నా…. మృత్యువు త‌ప్ప‌లేదు

హైద‌రాబాద్ – డాగ్ నుంచి త‌ప్పించుకునేందుకు అపార్ట్ మెంట్ నుంచి కింద‌కు దూకిన స్విగ్గీ డెలివ‌రీ బాయ్ మహ్మద్‌ రిజ్వాన్‌ హాస్ప‌ట‌ల్లో చికిత్స పొందుతూ క‌న్నుమూశాడు.. వివ‌రాల‌లోకి వెళితే బంజారాహిల్స్‌ రోడ్‌ నం.12లోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్‌ రిజ్వాన్‌ (23) మూడేండ్లగా స్విగ్గీస్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈనెల 9వ తేదీ రాత్రి పదిన్నర ప్రాంతంలో బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 6, లుంబినీ రాక్‌ కాజిల్‌ అపార్ట్‌మెంట్స్‌లోని మూడో ఫ్లోర్‌లో ఉంటున్న శోభన నాగానికి ఫుడ్‌ పార్సల్‌ డెలివరీ ఇచ్చేందుకు వెళ్లాడు. ఫ్లాట్‌ వద్దకు వెళ్లి డోర్‌ కొట్టగానే లోపల నుంచి శోభనకు చెందిన జర్మన్‌ షెఫర్డ్‌ కుక్క అతడి మీదకు వచ్చింది. దీంతో భయాందోళనకు గురైన రిజ్వాన్‌ కిందకు పరుగులు పెట్టాడు. ఈ క్రమంలో రెయిలింగ్‌ మీద నుంచి కిందపడిన రిజ్వాన్‌ తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఫ్లాట్‌ యజమాని శోభన స్థానికుల సాయంతో అతడిని నిమ్స్‌ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మైన శోభ‌న నాగానిపై పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement