Saturday, April 20, 2024

స్వ‌ర్గీయ దాస‌రినారాయ‌ణ‌రావు ఇంటికి నోటీసులు..ఎందుకో తెలుసా..

టాలీవుడ్ కి పెద్ద‌దిక్కుగా..ఎటువంటి స‌మ‌స్య వ‌చ్చినా చ‌క్క‌బెట్టే విధంగా స‌ల‌హాలు ఇచ్చేవారు స్వర్గీయ సినీ దర్శకులు దాసరి నారాయణ రావు. ఆయ‌న మ‌ర‌ణంతో టాలీవుడ్ పెద్ద దిక్కుని కోల్పొయింది. అయితే ప‌లు చిత్రాల్లో న‌టించ‌డ‌మే కాకుండా..ద‌ర్శ‌కునిగా..నిర్మాత‌గా ఎన‌లేని పేరుని సంపాదించారాయాన‌. అంత‌టి మ‌హానుభావుడి కుటుంబానికి ఊహించని షాక్ తగిలింది. దాసరి నారాయణ రావు ఇంటికి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేశారు. ఆర్డర్ 34, రూల్స్ & SOFCPC.RW.SEC 151 CPC క్రింద ఆర్డర్ కింద దాసరి నారాయణ రావు ఇంటి కి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేశారు.

వ్యాపార లావాదే వీ ల్లో భాగంగా ఓ ప్లాంట్ నిర్మాణం కోసం 2 కోట్ల 11 లక్షల రూపాయలు దాసరి ప్రభు.. దాసరి అరుణ్ తీసుకున్నారు. ఒప్పందం ప్రకారం తిరిగి డబ్బులు చెల్లించడం లో దాసరి ప్రభు మరియు దాసరి అరుణ్ జాప్యం చేశారు. ఈ నేపథ్యంలోనే సోమ శేఖర్ అనే బాధితుడు సిటీ సివిల్ కోర్టు కోర్టు ను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే దాసరి నారాయణ రావు ఇంటి కి సిటీ సివిల్ కోర్టు నోటీసులు జారీ చేశారు. 2 కోట్ల 11 లక్షల రూపాయలు పిటిషనర్ సోమ శేఖర్ రావు కి చెలించాలని సిటీ సివిల్ కోర్టు నోటీసుల్లో పేర్కొంది. చెల్లించాలసిన డబ్బులు రెండు వారాలు అంటే 15/11/2021 వరకు ఇచ్చేయాలని నోటీసుల్లో వెల్లడించింది కోర్టు..ఈ నోటీసులను దాసరి ప్రభు మరియు దాసరి అరుణ్ ల కు జారీ చేసింది సిటీ సివిల్ కోర్టు.

Advertisement

తాజా వార్తలు

Advertisement