Monday, January 30, 2023

ముగ్గురు ఆబ్కారీ సీఐల సస్పెన్షన్..

మద్యం దుకాణాల్లో ఎమ్మార్పీ ధరల ఉల్లంఘనల్ని నియంత్రించడంలో విఫలమైన అధికారులపై ఆబ్కారీ శాఖ కొరడా ఝుళిపించింది. ఒకేసారి వేర్వేరు జిల్లాలకు చెందిన ముగ్గురు సీఐలను సస్పెండ్ చేసింది. సస్పెన్షన్లకు గురైన వారిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం సీఐ నరేందర్, మహబూబాబాద్ సీఐ రమేశ్ చందర్, సూర్యా పేట జిల్లా హుజూర్ నగర్ సీఐ శ్యామస్సుందర్ ఉన్నారు. కొత్తగూడెం, మహబూబాబాద్, హుజూర్ నగర్ తదితర ప్రాంతాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరుగుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సమాచారం అందుకున్న ఆబ్కారీ శాఖ ఎన్ ఫోర్స్మెంట్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిం చారు. ధరలు ఉల్లంఘనలు వాస్తమేనని గుర్తించి నివేదిక అందించడంతో ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

- Advertisement -
   

Advertisement

తాజా వార్తలు

Advertisement