Friday, March 29, 2024

కరోనా ఆంక్షలను సడలించిన కేరళ సర్కారుపై సుప్రీంకోర్టు ఆగ్రహం

బుధవారం బక్రీద్ పండగ సందర్భంగా కేర‌ళ ప్ర‌భుత్వం లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను స‌డిలించింది. వ్యాపార‌ులకు వెసులుబాటు క‌ల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే కేరళ ప్రభుత్వ వైఖరిని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. బ‌క్రీద్ పండుగ కోసం కోవిడ్ నిబంధ‌న‌ల‌ను స‌డ‌లించ‌డం ప‌ట్ల ఆ రాష్ట్ర ప్ర‌భుత్వంపై సుప్రీం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

కేర‌ళ ప్ర‌భుత్వ వైఖ‌రి షాకింగ్‌కు గురిచేస్తోంద‌ని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేయ‌డం వ‌ల్ల కొత్త‌గా ఏవైనా ఇన్ఫెక్ష‌న్లు పెరిగితే, అలాంటి ఘ‌ట‌న‌ల‌కు కోర్టు ముందుకు తీసుకువ‌స్తే, అప్పుడు కేర‌ళ‌పై చ‌ర్యలు తీసుకుంటామ‌ని సుప్రీం వెల్ల‌డించింది. క‌న్వ‌ర్‌యాత్ర నిర్వ‌హ‌ణ‌లో యూపీ ప్ర‌భుత్వానికి ఇచ్చిన తీర్పును ప‌రిశీలించాల‌ని కేర‌ళ‌ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది.

ఈ వార్త కూడా చదవండి: కొవాగ్జిన్‌కు అనుమతిపై WHO సమీక్ష

Advertisement

తాజా వార్తలు

Advertisement