Monday, March 25, 2024

మరాఠా రిజర్వేషన్లను రద్దు చేసిన సుప్రీం కోర్టు

మరాఠా రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది.  మరాఠా రిజర్వేషన్లను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చింది.  మరాఠా రిజర్వేషన్లు చట్ట విరుద్ధమని, ఆర్ధిక, సామాజిక వెనకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వబడ్డాయని, ఇప్పటికే 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని సుప్రీంకోర్టు పేర్కొంది. అయితే గతంలో జరిగిన అన్ని నియామకాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సుప్రీం కోర్టు పేర్కొన్నది.  సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై మరాఠా ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement