Thursday, December 5, 2024

Supreme Court – సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ప్రమాణ స్వీకారం

న్యూ ఢిల్లీ : దేశ 51వ సీజేఐగా జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లోని అశోక్‌ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు.

ఎన్నికల బాండ్లు, అధికరణం 370 తదితర కేసుల్లో సంజీవ్‌ ఖన్నా కీలక తీర్పులిచ్చారు. ఈ కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌, ప్రధాని మోడీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘ్వాల్‌ సహా తదితరులు హాజరయ్యారు

సీజేఐగా జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ పదవీకాలం ఆదివారంతో ముగిసింది. ఆయన స్థానంలో కొత్త సీజేఐ బాధ్యతలు స్వీకరించారు.వచ్చే ఏడాది మే 13 వరకు ఈయన పదవిలో కొనసాగనున్నారు. 2019 జనవరి నుంచి సుప్రీం కోర్టులో న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ఈ ఆరేళ్లలో 117 తీర్పులు ఇచ్చారు. 456 తీర్పుల్లో సభ్యుడిగా భాగస్వాములయ్యారు.

ఈవీఎంల నిబద్ధతను సమర్థిస్తూ కీలకమైన తీర్పు వెలువరించారు. ఎన్నికల బాండ్ల పథకం రద్దు, అధికరణం 370 రద్దును సమర్థిస్తూ తీర్పులు ఇచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌కు బెయిల్‌ ను మంజూరు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement