Friday, April 19, 2024

కేంద్ర పథకాల ద్వారా పరిశ్రమలకు సహకారం.. వైఎసీపీ ఎంపీ బీద మస్తాన్‌రావు ప్రశ్నకు కేంద్రం సమాధానం

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : దేశంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ  సౌకర్యాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం ద్వారా సహకారం అందజేస్తున్నామని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖామాత్యులు నారాయణ్ రాణే తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రుణ సౌకర్యాలను పెంపొందించడానికి తీసుకుంటున్న చర్యల వివరాలు తెలపాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బీద మస్తాన్‌రావు సోమవారం ప్రశ్నించారు. క్రెడిట్ డెలివరీ వ్యవస్థను పటిష్టం చేయడానికి గరిష్టంగా రెండు కోట్ల వరకు రుణ సౌకర్యం కల్పిస్తున్నట్టు కేంద్రమంత్రి ఎంపీ ప్రశ్నకు సమాధానమిచ్చారు.

దేశంలోని చిన్న, మధ్యతరహా, సూక్ష్మ పరిశ్రమలకు గత మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 13.26 లక్షల అకౌంట్లకు రూ. 71,877.26 కోట్లు, దేశంలో మొత్తం 264.67 లక్షల అకౌంట్లకు  రూ. 20,11,056 కోట్లను అందజేశారని కేంద్రమంత్రి వివరించారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంత  పరిశ్రమల శాఖలు, ఎంఎస్‌ఎంఈల వాటాదారుల సమన్వయంతో వర్క్‌షాప్‌లు, మీడియా, సోషల్ మీడియా ద్వారా కేంద్ర ప్రభుత్వం అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్టు జవాబులో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement