Saturday, September 30, 2023

Support – రెజ్ల‌ర్ల ఆందోళ‌ను మ‌ద్ద‌తు ప్ర‌క‌టించిన కపిల్ సేన‌, నీర‌జ్ చోప్రా…

ముంబై – లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌ భూషణ్‌ను అరెస్టు చేయాలని కోరుతూ రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు 1983 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలిచిన జట్టు స‌భ్యులు, జావెలిన్ త్రోయ‌ర్ ,ఒలింపియ‌న్ గోల్డ్ మెడ‌లిస్ట్ నీర‌జ్ చోప్రా మద్దతు ప్రకటించారు.. పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేస్తామన్న రెజ్లర్ల ప్రకటనపై ఆందోళన వ్యక్తం చేశారు.. తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని అభ్యర్థించారు..

- Advertisement -
   

బ్రిజ్‌ భూషణ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనలపై 1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత జట్టు స్పందించింది. “మా ఛాంపియన్ రెజ్లర్లపై ప్రభుత్వం, పోలీసులు ప్రవర్తిస్తున్న అసభ్య తీరును చూస్తుంటే మాకు చాలా బాధ కలుగుతుంది. మీరు ఎంతో కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో నిమజ్జనం చేయాలనే ఆలోచన మమ్మల్ని కలవరపరిచింది. ఎన్నో సంవత్సరాల కష్టపడితే గానీ ఆ పతకాలు మీకు రాలేదు. అవి రావడంలో మీతో పాటు ఎందరో త్యాగం, కృషి, దృఢ విశ్వాసం, దృఢ సంకల్పం కలిగి ఉన్నాయి. ఈ పతకాలు మీ గెలుపు మాత్రమే కాదు, దేశానికి కూడా ఎంతో గర్వకారణం. ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మేము మల్లయోధులను కోరుతున్నాం. అలాగే వారు లేవనెత్తుతున్న అంశాలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని త్వరగా సమస్యకు ముగింపు పలకాలని మేము కోరుతున్నామం” అంటూ ప్రకటనను విడుదల చేసింది.
ఒలింపియ‌న్ నీర‌జ్ చోప్రా ఒక ప్ర‌క‌టన విడుద‌ల చేస్తూ, రెజ్ల‌ర్లు చేస్తున్న ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement