Saturday, October 12, 2024

బుల్లితెరపై కూడా సూప‌ర్ రెస్పాన్స్.. ‘బ‌ల‌గం’ సినిమాకి అధిరిపోయే టీఆర్పీ రేటింగ్

వేణు ఎల్డండి దర్శకత్వంలో టాలీవుడ్ నటుడు ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఎమోష‌నల్ విలేజ్ డ్రామా బలగం. ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అంతే కాకుండా.. డిజిటల్ ప్రీమియర్ గా కూడా ఓటిటి లో సంచలనం సృష్టించింది. అయితే ఇటీవల ఈ సినిమా స్టార్ మా టీవీ ఛానెల్ లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కాగా, ఈ ప్రీమియర్ కి సంబందించిన టీఆర్పీ రేటింగ్ తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి 14.3 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఇది సూపర్ రెస్పాన్స్ అని చెప్పాలి. పలు అంతర్జాతీయ అవార్డులను కూడా గెలుచుకున్న ఈ మూవీ అన్ని చోట్ల బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement