Tuesday, April 23, 2024

ఐపీఎల్: ఇవాళ ఆర్సీబీ vs సన్ రైజర్స్

ఐసీఎల్ లో నేడే ఆర్సీబీ తో తలపడనుంది సన్ రైజన్స్ హైదరాబాాద్. ఈ సీజన్‌ను గెలుపుతో ఘనంగా ఆరంభించాలనుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు తొలి మ్యాచ్‌లో నిరాశే ఎదురైంది. రెండు రోజుల విరామం అనంతరం లీగ్‌లో రెండో పోరుకు‌ సిద్ధమైంది హైదరాబాద్. నేడు జరిగే మ్యాచ్‌లో కోహ్లి నాయకత్వంలోని రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుతో ఆడనుంది. తమ తొలి మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ షోతో డిఫెండింగ్‌ చాంపియన్‌ను బోల్తా కొట్టించిన బెంగళూరు మరో గెలుపుపై కన్నేయగా … సరైన వ్యూహాలతో బరిలోకి దిగి పాయింట్ల ఖాతాను తెరిచేందుకు వార్నర్‌ బృందం పట్టుదలగా ఉంది. ఇరు జట్లలోనూ భారీ హిట్టర్లు ఉండటంతో మరోమారు అభిమానులకు పరుగుల విందు లభించడం ఖాయం. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్‌కి ఆతిథ్యం ఇవ్వబోతుండగా.. ఇక్కడే తన తొలి మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో సన్‌రైజర్స్ హైదరాబాద్ 10 పరుగుల తేడాతో ఓడిపోయిన విషయం తెలిసిందే.

కాగా, కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్‌ తరఫున బెయిర్‌స్టో, మనీశ్‌ పాండే మినహా మిగతా వారు విఫలమయ్యారు. విలియమ్సన్‌ ఇంకా మ్యాచ్‌ ఫిట్‌నెస్‌ను సాధించలేదని కోచ్‌ బేలిస్‌ తెలియజేయడంతో అతడు ఈ మ్యాచ్‌కూ దూరం కానున్నాడు. అయితే వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌ జేసన్‌ హోల్డర్‌ రూపంలో హైదరాబాద్‌కు ఊరట లభించనుంది. అతడు తన తప్పనిసరి క్వారంటైన్‌ ముగించుకోవడంతో… బెంగళూరుతో జరిగే మ్యాచ్‌లో నబీ స్థానంలో బరిలో దిగే అవకాశం ఉంది. మరోవైపు సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో ముంబైను ఓడించడం ద్వారా బెంగళూరు టీమ్‌ ఆత్మవిశ్వాసంతో ఉంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, పవర్ హిట్టర్లు గ్లెన్ మాక్స్‌వెల్, ఏబీ డివిలియర్స్ మంచి టచ్‌లో ఉన్నట్లు కనిపిస్తున్నారు. గత మ్యాచ్‌కు దూరమైన దేవ్‌దత్‌ పడిక్కల్‌ ఈ మ్యాచ్‌లో రజత్‌ పటిదార్‌ స్థానంలో బరిలోకి దిగొచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement