Wednesday, May 19, 2021

చెన్నైలో డేవిడ్ భాయ్..కేన్ మామా

ఐపీఎల్ 2021 సీజన్ కి టైమ్ దగ్గరపడుతోంది. ఒక్కొక్క టీమ్ చెన్నైకి చేరుకుంటున్నాయి. ఇప్పటికే స‌న్‌రైజ‌ర్స్ కూడా చెన్నై చేరుకుంది. తాజాగా హైద‌రాబాద్ టీమ్ స్టార్ ప్లేయ‌ర్స్ డేవిడ్ వార్నర్‌, కేన్ విలియ‌మ్స‌న్ చెన్నైలో అడుగుపెట్టారు. వీళ్ల‌తోపాటు టీమ్ అసిస్టెంట్ కోచ్ బ్రాడ్ హ‌డిన్ కూడా వెళ్లారు. ఈ విష‌యాన్ని స‌న్‌రైజ‌ర్స్ టీమ్ త‌మ ట్విట‌ర్‌లో వెల్ల‌డించింది. ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయి. ఈగిల్స్ ల్యాండ్ అయ్యాయ‌ని మ‌ళ్లీ చెబుతున్నాం. కెప్టెన్ డేవిడ్ వార్న‌ర్‌, కేన్, బ్రాడ్ హ‌డిన్‌ల‌కు స్వాగ‌తం అని స‌న్‌రైజ‌ర్స్ టీమ్ ట్వీట్ చేసింది. 14వ సీజ‌న్ ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్ టీమ్ త‌న తొలి ఐదు మ్యాచ్‌ల‌ను చెన్నైలోనే ఆడ‌నుంది. తొలి మ్యాచ్‌ను ఈ నెల 11న కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌తో ఆడుతుంది. ఐదు మ్యాచ్‌ల త‌ర్వాత ఢిల్లీలో మ‌రో నాలుగు, కోల్‌క‌తాలో మూడు, బెంగ‌ళూరులో రెండు మ్యాచ్‌లు ఆడ‌నుంది.

Advertisement

తాజా వార్తలు

Prabha News