Thursday, March 28, 2024

రేపటి నుంచి పాలిటెక్నిక్ కాలేజీలకు వేసవి సెలవులు

తెలంగాణ‌లోని ప్ర‌భుత్వ‌, ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీల‌కు ఈ నెల 5వ తేదీ నుంచి వేస‌వి సెల‌వులు ప్ర‌క‌టిస్తున్న‌ట్లు సాంకేతిక విద్యాశాఖ ఉత్త‌ర్వులిచ్చింది. మే 31 వ‌ర‌కు వేస‌వి సెలవులు ఉంటాయ‌ని తెలిపింది. స‌వ‌రించిన అక‌డ‌మిక్ షెడ్యూల్‌ను త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని సాంకేతిక విద్యాశాఖ క‌మిష‌న‌ర్ న‌వీన్ మిట్ట‌ల్ స్ప‌ష్టం చేశారు. సెలవుల సమయంలో క్లాసులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టెక్నికల్ ఎడ్యుకేషన్ హెచ్చరించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement