Friday, April 26, 2024

సుకుమార్ డైరెక్ష‌న్ లో ధ‌నుష్ !

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో రీసెంట్ గా పుష్ప చిత్రాన్ని తెర‌కెక్కించాడు డైరెక్ట‌ర్ సుకుమార్. ఈ చిత్రం రిలీజ్ అయి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల‌ని పొందింది. కాగా పుష్ప‌2 కూడా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. వ‌చ్చే నెల‌లో ఈ షూట్ జ‌ర‌గ‌నుంది. ఈ చిత్రం త‌ర్వాత సుకుమార్ త‌మ‌ళి స్టార్ హీరో ధ‌నుష్ తో ఓ చిత్రాన్ని చేయ‌నున్నార‌ట‌. ఒక అద్భుత మైన క‌థ‌ను ధ‌నుష్ కు వినిపించ‌గా.. ధ‌నుష్ ఈ సినిమా చేయ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమా కు సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. కానీ త్వ‌ర‌లోనే ఈ సినిమా కు సంబంధించి ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. అయితే ప్ర‌స్తుతం ధ‌నుష్ కూడా ప‌లు సినిమా ల‌తో బిజీ గా ఉన్నాడు. తెలుగు లోనే వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సార్ అనే చేస్తున్నాడు. ఇప్ప‌టికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయింది. అలాగేశేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో ఒక సినిమా చేయ‌నున్నాడు. వీటితో పాటు త‌మిళ్ లో కూడా ధ‌నుష్ కు చాలా సినిమాలు ఉన్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement