Friday, October 4, 2024

Suicide – తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్య

హైదరాబాద్ – కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకున్నది. రంగారెడ్డి కలెక్టరేట్‌లో తుపాకీతో కాల్చుకుని కానిస్టేబుల్‌ ఆత్మహత్యకు పాల్పడ్డారు. 2018 బ్యాచ్‌కు చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ బాలకృష్ణ.. కలెక్టరేట్‌ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. మృతుని స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల అని తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement