Thursday, March 28, 2024

వీడియో: డ్యాన్స్ వేస్తూ సుహాసిని ఎన్నికల ప్రచారం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ప్రముఖ నటుడు కమలహాసన్‌ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసేందుకు సీనియర్ నటి సుహాసిని రంగంలోకి దిగారు. కమల్ ‘మక్కల్ నీది మయ్యం’ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తున్నారు. ఈ మేరకు శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ కార్యకర్తలతో కలిసి సుహాసిని చేసిన డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా ఈ ప్రచారంలో సుహాసినితో పాటు కమల్ కుమార్తె అక్షర హాసన్ కూడా పాల్గొనడం విశేషం.

సుహాసిని మరెవరో కాదు.. కమల హాసన్ సోదరుడు చారుహాసన్ కుమార్తె. తన చిన్నాన్న కమల్ తరపున ప్రచారం చేయనుండడం తనకెంతో ఆనందంగా ఉందని ఈ సందర్భంగా సుహాసిని పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement