Monday, April 15, 2024

సైకో కిల్లర్‌గా సుహాస్.. ‘ఫ్యామిలీ డ్రామా’ ట్రైలర్ విడుదల

‘కలర్‌ఫోటో’ చిత్రంతో హీరోగా మారిన సుహాస్‌ హీరోగా నటిస్తున్న నూతన చిత్రం ‘ఫ్యామిలీడ్రామా’. మెహెర్‌ తేజ్‌ స్వీయ దర్శకత్వంలో తేజ కాసరపుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. థ్రిల్లర్‌ క్రైమ్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రంలో సుహాస్‌ సైకో కిల్లర్‌గా నటిస్తున్నాడు.

ఈ మూవీ డిఫరెంట్‌గా తెరకెక్కుతోందని, తప్పనిసరిగా ఈ చిత్రం అన్ని వర్గాలను అలరిస్తుందనే విశ్వాసాన్ని దర్శకుడు తెలియజేశారు. పూజా కిరణ్‌, అనుషా నూతుల ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అజయ్‌ అండ్‌ సంజయ్‌ సంగీతం సమకూరుస్తున్నారు.

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement