Wednesday, March 27, 2024

అష్ట ఐశ్వర్యాలు కావాలంటే సూర్యుడిని ఉపాసించాలి

.నిజామాబాద్ రూరల్మార్చి15 ప్రభ న్యూస్ ఆరోగ్యం పాడిపంటలు బావుండాలంటే చంద్రుని అనుగ్రహం ఉండాలని ఆచార్య గంగోత్రి రామానుజ దాసు స్వామి అన్నారు. మో పాల మండలం లోని నర్సింగ్ పల్లి లో బుధ వారంఇందూరు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడవ రోజు *ఉదయం సూర్యప్రభ వాహనంపై సాయంత్రం చంద్ర ప్రభ వాహనం పై ఊరేగిన శ్రీవారు.*సూర్యోపాసన ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం ఇత్యాది లభిస్తాయని గంగోత్రి రామానుజదాసు స్వామి అన్నారు.రాముడు సూర్యుడిని ఉపాసించి రావణుడితో యుద్దం గెలిచాడు ఆంజనేయుడు సూర్యుడిని ఉపాసించి సర్వశక్తివంతుడైనాడుసత్రజిత్తుడు సూర్యుడిని కొలిచే శమంతకమణిని పొందాడు.చంద్రుడిని ఉపాసన చేస్తే వజ్రకాయులు అవతారు మరియు చంద్రుని వెన్నెలతో పంటలు ఇత్యాది ఔషధ తుల్యంగా మారుతాయని అన్నారు.లోక క్షేమం బ్రహ్మోత్సవాల్లో ఆ దేవదేవుడు ఈ రోజు సూర్యప్రభ మరియు చంద్రప్రభ వాహనాలపై వేంచేసారని అన్నారు.భగవంతుడి నిర్వహణలో ఏ లోటు ఉండదు. ఆయన సృష్టి చాలా సౌందర్యంగా ఉంటది అని అన్నారు.

అన్నింటినీ తానే నియమించాను అని చూపెట్టాడానికి సూర్య ప్రభ మరియు చంద్ర ప్రభ వాహనాల పై ఆ దేవ దేవుడు వేంచేస్తాడు అని దేవానాథ జీయరు స్వామి వారు అన్నారు. ప్రపంచాన్ని చూపెట్టడానికి సుర్యుడిగ ఉదయిస్తాడు… అంతర్యామిగా ఉన్న భగవుంతుడే సూర్యునిగా ఉదయిస్తాడు అని ప్రవచించారు.మనిషిలో అంతర్యామిగా భగవంతుడు ఉంటాడు. ప్రతి చెట్టు పుట్ట రాయి అన్నింటిలో అంతర్యామిగా ఆ దేవదేవుడు ఉంటాడు. అన్నింటినీ నడిపే శక్తి ఆయనే ఇస్తాడు కాబట్టి ఆ దేవదేవుని సర్వదా కృతజ్ఞతా పూర్వకంగా వుండాలి అని అన్నారు. మూడవ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వారు ఉదయం సూర్య ప్రభ వాహనం పై సాయంత్రం చంద్రప్రభ వాహనంపై మరియు గజవాహనంపై ఆలయ మాడ వీధుల గుండా ఊరేగినారు. *సాయంత్రం స్వామి వారి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహించారు*.ఆలయ ఆస్థాన గాయకులు రెండు జట్టులుగ విడిపోయి ఒక జట్టు అమ్మవారి గుణగణాలను కీర్తిస్తే మరో జట్టు స్వామి వారి గుణగణాలను కీర్తించారు. ఆద్యంతం నువ్వా నేనా అన్నట్టు ఎదుర్కోలు కార్యక్రమం రసవత్తరంగా జరిగింది. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మాడ వీధుల్లో పాటలు పాడుతూ నృత్యాలు చేశారు.

ఈ *కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు , నరసింహారెడ్డి, విజయసింహారెడ్డి, శిరీష్*, రవియాదవ్ నర్సారెడ్డి నరాల సుధాకర్ ప్రసాద్ రాజేశ్వర్ రమేష్ సాయిలు భాస్కర్ మురళి చిన్నయ్య ప్రమోద్ గంగారెడ్డి లక్ష్మి నరేష్ సురేష్ యజ్ఞాచార్యులు లక్ష్మణాచారి స్వామి ,సంపత్ కుమారాచార్యులు, స్వామి రోహిత్ కుమారాచార్యులు, విజయ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement