Friday, April 19, 2024

ఓ బ్రాండ్ షూట్ కోసం కొత్త లుక్ లో ఎన్టీఆర్.. తార‌క్ లుక్ సూప‌ర్ అంటోన్న ఫ్యాన్స్

ద‌ర్శ‌కుడు కొర‌టాల‌శివ డైరెక్ష‌న్ లో న‌టించ‌నున్నాడు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన జనతా గ్యారేజ్‌ సినిమా విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరో సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. ఈ సినిమాకు కొరటాల దర్శకత్వం వహిస్తుండగా.. మిక్కిలినేని సుధాకర్‌ తో కలిసి హీరో కళ్యాణ్‌ రామ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. పాన్‌ ఇండియా లెవెల్ లోనే ఈ సినిమాప్రేక్షకుల ముందుకు రానుందనే టాక్‌ నడుస్తోంది. కాగా తాజాగా కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చారు ఎన్టీఆర్.. ఎన్టీఆర్ కొత్త లుక్ అదిరిపోయింది. ఓ బ్రాండ్ షూట్ కోసం తారక్ ఈ లుక్ లో కనిపించగా, సింపుల్ గాగుల్స్, సూట్ డ్రెస్ తో తారక్ చాలా కూల్ గా ఉన్నారు. దీంతో తారక్ లుక్ సూపర్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement