Tuesday, April 16, 2024

కోచింగ్​ సెంటర్ మూసేశారని విధ్వంసకాండ!

దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. దీంతో వివిధ రాష్ట్రాలు పలు ఆంక్షలు కొనసాగిస్తున్నాయి. ఇప్పటికే స్కూళ్లు, విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లను మూసివేశారు. అయితే, బిహార్​లో కరోనా నిబంధనల అమలుకు పోలీసులు, అధికారులు యత్నించడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. కొవిడ్ మార్గదర్శకాల అమల్లో భాగంగా ఓ కోచింగ్​ సెంటర్​ను అధికారులు మూసివేయించారు. అయితే, దీనిని విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకించారు. రాళ్లు రువ్వి, వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటన బిహార్​లోని సారారంలో చోటు చేసుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement