Thursday, April 25, 2024

గట్టెక్కిన ఆదానీ ఎఫ్‌పీఓ.. ఆదుకున్న సంస్థాగత ఇన్వెస్టర్లు

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ 20 వేల కోట్ల సమీకరణ కోసం ప్రకటించిన ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ) గట్టెంచగలిగారు. రిటైల్‌ ఇన్వెస్టర్ల నుంచి పెద్దగా స్పందన రాకపోవడంతో సంస్థాగత ఇన్వెస్టర్ల సహాయంతో వంద శాతం సబ్‌స్క్రైబ్‌ అయ్యిందని పిచ్చారు. హిండెన్‌బర్గ్‌ నివేదికతో అదానీ గ్రూప్‌ కంపెనీల షేర్లన్నీ తీవ్ర ఒడుదొడుకుల్లో ట్రేడవుతున్నాయి. మొత్తం 4.55 కోట్ల షేర్లను జారీ చేశారు. ఆఫర్‌ గడువు మంగళవారం ముగిసే సమయానికి 4.62 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు 96.16 లక్షల షేర్లు రిజర్వ్‌ చేస్తే, ఈ విభాగంలో మూడురేట్లు బిడ్లు వచ్చాయి.

సంస్థాగత మదుపర్లకు కేటాయించిన స్టాక్స్‌ పూర్తిగా సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. రిటైల్‌ ఇన్వెస్టర్లకు 2.29 కోట్ల షేర్లు కేటాయించగా, కేవలం 11 శాతం మాత్రమే సబ్‌స్క్రైబ్‌ అయ్యాయి. అదానీ గ్రూప్‌ ఉద్యోగులకు కేటాయించిన 1.6 లక్షల షేర్లలో కేవలం 52 శాతం షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి. హిండెన్‌బర్గ్‌ నివేదిక ప్రభావం అదానీ పబ్లిక్‌ ఆఫర్‌పై గట్టిగానే చూపించింది. ఆఫర్‌లో పెట్టిన షేర్‌ ధర కంటే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు స్టాక్‌ మార్కెట్‌లో తక్కువకే ట్రేడ్‌ అవుతోంది. దీంతో రిటైల్‌ ఇన్వెస్టర్లు బిడ్ల జోలికి వెళ్లలేదని మార్కెట్‌ నిపుణులు స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement