Tuesday, April 16, 2024

Story – ఎంగేజ్ మెంట్స్ క్యాన్సిల్ – పెళ్లి వూసె ఎత్త‌ని సినీ స్టార్స్

సినీ ప‌రిశ్ర‌మ‌లో 30..40ఏళ్లు దాటినా పెళ్ళి మాటే ఎత్త‌ని స్టార్స్ చాలా మంది ఉన్నారు. పెళ్లి మాటేమోగాని ఎంగేజ్ మెంట్ చేసుకుని వాటిని క్యాన్సిల్ చేసుకున్న వారు కూడా వున్నారు. అలా త‌మ నిశ్చితార్థాన్ని ర‌ద్దు చేసుకున్న‌వారిలో త్రిష, రష్మిక, విశాల్, అఖిల్.. ఇలా చాలా మంది యంగ్ స్టార్స్ ఎంగేజ్ మెంట్స్ తరువాత తమ పెళ్లిని కాన్సిల్ చేసుకున్నారు. రీసెంట్ ఇయర్స్ లో ఎంగేజ్ మెంట్ కాన్సిల్ చేసుకున్న హీరోయిన్ మెహ్రీన్. టాలీవుడ్ హీరోయిన్ మెహరిన్ ఎంగేజ్ మెంట్ యువ నేత భవ్య బిస్ణోయ్ తో గతేడాది జరిగింది. కాని ఆతరువాత ఏం జరిగిందో ఏమో కాని.. ఈ జంట పెళ్లి కాకుండానే విడిపోయింది. పెళ్లి తరువా మెహ్రీన్ సినిమాలు చేయదని ప్రచారం జరిగింది. కాని కెరీర్ లో వరుస ఆఫర్లు అందుకుంటున్న స్టార్ హీరోయిన్.. కెరీర్ కోసం పెళ్లి వదులుకుందని టాక్ వినిపిస్తోంది.

స్టార్ హీరోయిన్ గా రాణించిన త్రిష కు వరుణ్ మణియన్ అనే వ్యాపారవేత్తతో 2015లో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పెళ్లి చేసుకోకుండానే ఈ జంట విడిపోయింది. ఆతరువాత త్రిష పెళ్లి గురించి చాలా రూమర్స్ వచ్చాయి. కాని ఇప్పటి వరకూ ఆమె ఓ ఇంటిది కాలేకపోయింది. కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు కూడా ఎంగేజ్ మెంట్ తరువాత పెళ్లి కాన్సిల్ అయ్యింది. ముందుగా విశాల్ కు ..శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీతో ప్రేమ వ్యవహారం నడిచిందని సౌత్ లో టాక్ గట్టిగా నడిచింది. ఆతరువాత అనిషా ఆల్లరెడ్డి తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ ఆరు నెలల తర్వాత ఈ జంట విడిపోయింది.

ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న రష్మిక మందన గతంలో లో కన్నడ హీరో రక్షిత్ శెట్టి తో ప్రేమలో మునిగి తేలింది. వీరిద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. కానీ ఎంగేజ్మెంట్ తర్వాత టాలీవుడ్ లో వరుస ఆఫర్ లు రావడంతో రష్మిక రక్షిత్ శెట్టికి బ్రేకప్ చెప్పింది. ఇక ప్రస్తుతం రష్మిక విజయ్ దేవరకొండ తో డేటింగ్ లో ఉన్నట్టు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. అక్కినేని యువ హీరో.. నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేనికి కూడా ఇదే అనుభవం ఎదురయ్యింది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలోనే.. చాలా చిన్నవయస్సులో… తన ప్రియురాలు శ్రియా భూపాల్ తో ఎంగేజ్మెంట్ జరిగింది. కానీ వీరిద్దరు కూడా పెళ్ళి కాకుండానే విడిపోయారు. ఇలా ప‌లువురు పెళ్ళి పీట‌లు ఎక్కే ముందే త‌మకు కాబోయే భాగ‌స్వామితో విడిపోయి సింగిల్ గానే వున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement