Thursday, March 28, 2024

ఆల్ టైమ్ రికార్డు.. 63 వేలు దాటిన సెన్సెక్స్..

దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయిని తాకాయి. రికార్డు స్థాయిలో సెస్సెక్స్‌ 63వేలు, మరో వైపు నిఫ్టీ 18,800 మార్క్‌ను దాటి జీవనకాల గరిష్ఠానికి చేరాయి. ట్రేడింగ్‌ ముగిసే సరికి సెన్సెక్స్‌ 417.81 పాయింట్లు లాభపడి 63,099.65 వద్ద, మరో వైపు నిఫ్టీ సైతం 140.30 పాయింట్లు ఎగబాకి.. 18,758.30 వద్ద ట్రేడింగ్‌ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాల నేపథ్యంలో మార్కెట్లలో జోష్‌ కనిపించింది. బుధవారం ట్రేడింగ్ సెషన్‌లో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 63,303 పాయింట్ల గరిష్ఠ స్థాయికి చేరింది.

నిఫ్టీ తొలిసారిగా 18,800 మార్క్‌ను దాటి.. 18,816 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయిని తాకింది. ఆటో ఇండెక్స్, ఎఫ్‌ఎంసీజీ, మెటల్స్ అండ్‌ రియాల్టీ ఇండెక్స్‌ లాభాలను నమోదు చేశాయి. ఎంఅండ్ఎం, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, హెచ్‌యూఎల్‌, భారతీఎయిర్‌టెల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ లాభాల్లో లాభాల్లో కొనసాగగా.. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, టీసీఎస్‌ షేర్లు పతనమయ్యాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement