Saturday, April 20, 2024

Follow up : నష్టాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు.. సెన్సెక్స్‌ 230, నిఫ్టీ 76 పాయింట్లు పతనం

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు గురువారం స్తబ్దుగా ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతోపాటు వారాంతపు డెరివేటివ్‌ ముగింపు ప్రభావం సూచీలపై పడింది. ఉదయం ప్రతికూలంగా ప్రారంభమైన ట్రేడింగ్‌ రోజంతా ఒడుదొడుకుల్లోనే కొనసాగింది. మధ్యాహ్నం వరకు కూడా నష్టాల్లో కదలాడిన సూచీలు, ఆ తర్వాత షార్ట్‌ కవరింగ్‌ కారణంగా లాభాల్లోకి వచ్చాయి. అయితే అది ఎంతోసేపు నిలబడలేదు. ఆఖరి గంటలో మళ్లి అమ్మకాల ఒత్తిడితో మళ్లి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 230 పాయింట్ల నష్టంతో 61,750 పాయింట్ల వద్ద స్థిరపడగా, నిఫ్టీ 76 పాయింట్లు కోల్పోయి 18,343 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్‌ -30 సూచీలో 8 షేర్లు లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, భారతీ ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, రిలయన్స్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటాన్‌, ఎంఅండ్‌ఎం, మారుతీ, హెచ్‌డీఎఫ్‌సీ, డాక్టర్‌ రెడ్డీస్‌, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, కొటక్‌ మహింద్రా బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, సన్‌ఫార్మా షేర్లు నష్టపోయాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి ఫారెక్స్‌ మార్కెట్‌లో రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ.81.57 వద్ద నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement