Tuesday, April 16, 2024

Followup: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

దేశీయ స్టాక్‌మార్కెట్‌లో వరసగా మూడు రోజుల నష్టాలకు మంగళవారంనాడు బ్రేక్‌ పడింది. ఉదయం ప్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు కొద్దిసేపటికే కొలుకున్నాయి. చివరి గంటలో కొనుగోళ్ల మద్దతుతో ఇంట్రాడే గరిష్టాల వద్ద ట్రేడింగ్‌ ముగించాయి. యూఎస్‌, యూకే ప్యూచర్స్‌ లాభపడడం మన మార్కెట్లకు కలిసి వచ్చింది. చమురు ధరలు 90 డాలర్లకు లోపుకు పడిపోవడం సానుకూలంగా మారింది. మూడు రోజుల వరస నష్టాలతో మదుపర్లు కొనుగోళ్ళకు మొగ్గు చూపడంతో సూచీలకు మద్దతు లభించింది.

సెన్సెక్స్‌ 274.12 పాయింట్లు లాభంతో 61418.96 వద్ద ముగిసింది. నిఫ్టీ 84.25 పాయింట్ల లాభంతో 18244.20 వద్ద ముగిసింది. బంగారం 10 గ్రాముల ధర 97 రూపాయలు పెరిగి 52389 వద్ద ట్రేడయ్యింది. వెండి కిలో ధర 594 రూపాయలు పెరిగి 61229 వద్ద ట్రేడయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 81.47 రూపాయలుగా ఉంది.

- Advertisement -

లాభపడిన షేర్లు

ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎన్‌టీపీసీ, ఆల్ట్రాసిమెంట్‌, ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, ఎల్‌ అండ్‌ టీ, టాటా స్టీల్‌, ఎం అండ్‌ ఎం, టెక్‌ మహీంద్రా, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, మారుతి సుజుకీ, విప్రో, యాక్సిస్‌ బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి.

నష్టపోయిన షేర్లు

నెస్లే ఇండియా, పవర్‌ గ్రిడ్‌ కార్పొరేషన్‌, భారతీ ఎయిర్‌టెల్‌, కొటక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, బజాజ్‌ ఆటో, సిప్లా, ఐచర్‌ మోటార్స్‌, కోల్‌ ఇండియా, ఓన్‌జీసీ, బీపీసీఎల్‌ షేర్లు నష్టపోయాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement