Thursday, November 28, 2024

Stock Market – షేర్ మార్కెట్ కు బ్లాక్ మండే..

ముంబ‌యి – దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం భారీ నష్టాల్లో ముగిసింది. ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతానికి పైగా నష్టపోయాయి. సెన్సెక్స్ 941.88 పాయింట్లు నష్టపోయి 78,782 వద్ద ముగియగా… నిఫ్టీ 314 పాయింట్లు నష్టపోయి 23,990 స్థిరపడింది. 1,279 స్టాక్స్ లాభాల్లో ముగియగా… 2,603 స్టాక్స్ నష్టాల్లో ముగిశాయి.

రంగాలవారీగా చూస్తే నిఫ్టీ ఎనర్జీ 2.72 శాతం, నిఫ్టీ రియాల్టీ 2.9 శాతం, నిఫ్టీ ఇన్‌ఫ్రా 2.2 శాతం నష్టపోయాయి. అమెరికా ఎన్నికల ప్రభావం మార్కెట్‌పై కనిపించింది. అగ్రరాజ్యంలో ఎన్నికలకు మరికొన్ని గంటలే ఉండటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత పాటించారు. మార్కెట్ భారీ నష్టాల్లో ముగియడంతో దాదాపు రూ.5 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది.

- Advertisement -

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపు జరగనున్నాయి. దీంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. దిగ్గజ సంస్థలు రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, ఐసీఐసీఐ బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, సన్ ఫార్మా నష్టాల్లో ముగిశాయి. ఎల్ అండ్ టీ, యాక్సిస్ బ్యాంకు, టీసీఎస్, టాటా మోటార్స్ స్టాక్స్ కూడా నష్టాల్లోనే ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement