Thursday, March 28, 2024

నష్టాలతో ముగిసిన మార్కెట్లు

కరోనా మహమ్మారి ఎఫెక్ట్ స్టాక్ మార్కెట్ల పై భారీగా పడుతోంది. కరోనా కేసులు ఈ రోజు లక్ష దాటడంతో మార్కెట్లు కుదుపునకు గురయ్యాయి. కరోనా కేసుల కొత్త సంఖ్య లక్షను దాటడంతో మదుపుదారుల సెంటిమెంట్ దెబ్బతింది. దాంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు తెగబడడంతో స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలను చవిచూశాయి. ఈ రోజు ఉదయం మార్కెట్లు ప్రారంభమైన తొలిదశలోనే ఇన్వెస్టర్లు అమ్మకాలకు దిగారు. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1449 పాయింట్ల వరకు నష్టపోయింది. తర్వాత ఐటీ షేర్ల అండతో కాస్త కోలుకుని, చివరికి 870.51 పాయింట్ల నష్టంతో సెన్సెక్స్ 49159.32 వద్ద.. 229.55 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 14637.55 వద్ద ముగిశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement