Friday, April 19, 2024

ఎల్‌ఐసీ ఐపీఓపై స్టే.. నిరాకరించిన‌ సుప్రీం..

దేశంలోని అగ్రశ్రేణి బీమా కంపెనీ ఎల్‌ఐసీ ఐపీఓ ప్రక్రియను నిలిపివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. దీంతో ఎల్‌ఐసీకి, దాని వాటాలు కొనుగోలు చేయాలని ఆరాటపడుతున్న ఇన్వెస్టర్లకు గొప్ప ఊరట లభించినట్లయింది. ఐపీఓ ద్వారా వాటాల కేటాయింపు గురువారంనాడే పూర్తి చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు అవరోధం ఏర్పడుతుందేమోనని అంతా అనుకున్నారు. అయితే, కోర్టు ఉత్తర్వులతో ఈ ప్రక్రియ యథావిధిగా కొనసాగనున్నది. ఈ వ్యవహారంలో మేము స్టే ఇవ్వలేము. ఇప్పటికే ఐపీఓ కింద వాటాల కొనుగోలు కోసం 73 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇది పెట్టుబడులకు సంబంధించిన అంశం. మేము ఎలాంటి రిలీఫ్‌ ఇవ్వలేము అని సుప్రీం కోర్టు బెంచ్‌ స్పష్టం చేసింది.

అయితే, ఫైనాన్స్‌ యాక్ట్‌ 2021, ఎల్‌ఐసీ చట్టం 1956లోని కొన్ని సెక్షన్‌ల రాజ్యాంగ బద్దతపై పిటిషనర్లు వ్యక్తం అభ్యంతరాలపై కేంద్రానికి కోర్టు నోటీసులు జారీ చేసింది. జస్టిస్‌ చంద్రచూడ్‌, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహాలతో కూడిన ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్‌ఐసీ మెగా ఐపీఓపై దాఖలైన పిటిషన్‌లను ఈ బెంచ్‌ విచారిస్తున్నది. ద్రవ్య బిల్లు ద్వారా ఎల్‌ఐసీ వాటాల విక్రయానికి ప్రభుత్వం సిద్ధపడడంలోని చట్టబద్ధతను పిటిషనర్లు సవాల్‌ చేశారు. కాగా… ఎల్‌ఐసీ ఐపీఓకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ దరఖాస్తులు వచ్చాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి

Advertisement

తాజా వార్తలు

Advertisement