Friday, March 29, 2024

రాష్ట్ర అవతరణ వేడుకల ఫుల్ డ్రెస్ రిహార్సల్ : సీఎస్ సోమేశ్ కుమార్

హైదరాబాద్ : జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మంగళవారం పరిశీలించారు. నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో జరగనున్న ఈ వేడుకలకు సంబంధించి పూర్తి డ్రెస్ రిహార్సల్‌ పరేడ్ ను వీక్షించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు జూన్ 2 న పబ్లిక్ గార్డెన్ లో జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా గన్ పార్క్ వద్ద ఉన్న తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం పబ్లిక్ గార్డెన్ కు చేరుకొని పోలీస్ దళాల వందనం స్వీకరిస్తారు. అనంతరం, ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాలకు సంబందించి పూర్తి రిహార్సల్ ను సి.ఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. కోవిద్ కారణంగా రెండేళ్ల తర్వాత నిర్వహిస్తున్న ఈ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నట్టు సి.ఎస్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement